భారతదేశం, మార్చి 3 -- ATM Robbery: హైదరాబాద్‌ శివార్లలోని ఆదిభట్లలో ఏటీఎం పగులగొట్టి రూ.30లక్షలతో ఉడాయించడం కలకలం రేపింది. నిందతులు పక్కా ప్రణాళికతో కారులో వచ్చి నింపాదిగా చోరీ చేసి వెళ్లిపోయారు. కేవలం నాలుగు నిమిషాల్లో ఏటీఎంను కొల్లగొట్టి పరారయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

ఆదిభట్ల పీఎస్‌ పరిధిలోని రావిర్యాల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున 2:13 గంటలకు దుండగులు మాస్కులు ధరించి ఏటీఎం లోపలకు ప్రవేశించారు. లోపలకు రాగానే నల్లటి స్ప్రేను సీసీ కెమెరాలపై దృశ్యాలు రికార్డు కాకుండా చల్లారు. ఏటిఎం అల్లారం మోగకుండా వాటి కేబుళ్లను కట్ చేశారు.

నిందుతులు వెంట తెచ్చుకున్న కట్టర్, రాడ్లతో ఏటీఎం యంత్రాన్ని ను ధ్వంసం చేశారు. అందులో ఉన్న రూ.29.69లక్షల నగదు తీసుకెళ్లారు. ఏటిఎంలో నగదు ఉంచే ట్రేలతో సహా తీసుకెళ్లిపోయారు....