భారతదేశం, ఏప్రిల్ 2 -- ఏటీఎం లావాదేవీలు మరింత భారంగా కానున్నాయి. ఎందుకంటే ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. మే 1, 2025 నుండి అమలులోకి వచ్చే విధంగా ఏటీఎం లావాదేవీలకు బ్యాంకులు గరిష్టంగా రూ.23 రుసుము వసూలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. గతంలో రూ.21గా ఉన్న గరిష్ట రుసుము ఇప్పుడు రూ.23కి పెంచారు.

నెలవారీ ఉచిత లావాదేవీ పరిమితి ముగిసిన తర్వాత రుసుములు వర్తిస్తాయి. మే 1, 2025 నుండి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ప్రతి లావాదేవీకి రూ.23 వసూలు చేయడానికి బ్యాంకులను అనుమతించింది. గతంలో ఇది 21 రూపాయలు ఉండేది.

ఈ ఛార్జీలు నెలకు ఐదు ఉచిత లావాదేవీల గడువు ముగిసిన తర్వాత మాత్రమే వర్తిస్తాయి. ఉచిత లావాదేవీలు మునుపటిలాగే ఉంటాయి. సొంత బ్యాంకు ఏటీఎం నుంచి నెలకు 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. వేరే బ్యాంకు ఏటీఎం నుంచైతే.. మెట్రో నగరాల్లో 5 ఉచిత లావా...