భారతదేశం, మార్చి 9 -- గతేడాది కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. పెద్ద మెుత్తంలో పెట్టుబడులను సమీకరించాయి. తాజాగా ఏథర్ ఎనర్జీ కూడా ఐపీఓకు వచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ తన బకాయి ఉన్న కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను(సీసీపీఎస్) ఈక్విటీగా మార్చడం ద్వారా మోస్ట్ అవైటెడ్ ఐపీఓ (ఐపీఓ) దిశగా కీలక అడుగు వేసింది. కంపెనీ ఐపీఓకు సన్నద్ధమవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్లో కంపెనీ ఐపీఓ రానుందని తెలుస్తోంది.

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ)లో దాఖలు చేసిన పత్రాల ప్రకారం, కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2025 మార్చి 8న 1.73 కోట్లకు పైగా బకాయి ఉన్న సీసీపీఎస్‌ను 24.04 కోట్ల పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లుగా మార్చడానికి ఆమోదం తెలుపుతూ ఒక తీర్మా...