Hyderabad, మార్చి 20 -- మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పటి వీడియోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. తాజాగా సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమి మీదకి చేరుకున్నారు. ఆమెకు సంబంధించిన వీడియోలు మాత్రం ఇంకా ట్రెండవుతూనే ఉన్నాయి. ఆ వీడియోలలో ఆమె తన జుట్టును మొత్తం స్వేచ్ఛగా వదిలేసింది. ఈమె మాత్రమే కాదు ఎంతోమంది మహిళా వ్యోమగాములు తమ జుట్టును అలా వదిలేసి అంతరిక్ష కేంద్రంలో కనిపిస్తూ ఉంటారు. వీరంతా అంతరిక్ష కేంద్రంలో ఎందుకు జుట్టును ముడి వేసుకోరు? ఎందుకలా వదిలేస్తారు? అనే ప్రశ్న ఎంతోమందికి మెదులుతుంది.

అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అదే భూమిపై గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి జుట్టు కింది వైపుగా లాగినట్టు ఉంటుంది. అలాగే వెంట్రుకలు రాలడం, తరచుగా చిక్కులు పడడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అంతరిక్షంలో ఎలాంటి గురుత్వాకర్...