Hyderabad, మార్చి 21 -- ఆయుర్వేదం ప్రకారం ప్రకృతిలో లభించే ప్రతి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కొన్ని రకాల మొక్కలు ఆరోగ్యానికి వరంగా పని చేస్తాయని భావిస్తారు. అనేక రకాల వ్యాధులను నయం చేయగల శక్తి పలు రకాల వేర్లు, కాండం, మొక్కల్లో ఉంటుందని నమ్ముతారు. అలాంటి ఒక ఆయుర్వేద ఔషధ మొక్క ఆస్పరాగస్. దీన్నే శతావరి, పిల్లితేగ అని పిలుస్తారు.

ఆస్సరాగస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, రోగనిరోధక శక్తిని బలపరిచే లక్షణాలు ఉంటాయి. ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా ప్రత్యుత్పత్తి ఆరోగ్యం, చర్మంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ మొక్కలోని వేరు, కాండం, ఆకులు అన్ని భాగాలు ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఆస్పరాగస్‌ను ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం రండి..

శతావరిని సేవించడం వల్ల ప్రత్యుత్పత్తి(Reproductio...