Hyderabad, డిసెంబర్ 28 -- ఆయుర్వేదం ప్రకారం గోరు వెచ్చటి పాలు నిద్రలేమికి చక్కటి నివారణ. పాలకు జాజికాయ తోడైతే మరింత చక్కటి నిద్రను పొందవచ్చు. అలాగే ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత కలిగిన అశ్వగంధ శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటం నుంచి శక్తిని పెంచడం, హర్మోన్లను సమతుల్యం చేయడం వంటి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన దాల్చిన చెక్కపొడి రక్తపోటును నియంత్రిస్తుంది, మెటాబాలిజం పెంచి శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది.

ఇలా అనేక ప్రయోజనాలను అందించే రకరకాల పదార్థాలన్నింటినీ కలిపి ఒకేసారి తీసుకుంటే ఎంత బాగుటుందో కదా. అవును మీరు వింటున్నది నిజమే. వీటన్నింటినీ కలిపి చక్కటి ఛాయ్ తయారు చేసుకోవచ్చు. దాని పేరే అశ్వగంధ ఛాయ్. ఉదయాన్నే ఈ ఛాయ్ తయారు చేసుకుని సిప్ చేశారంటే రుచితో పాటు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజ...