భారతదేశం, మార్చి 20 -- Ashok Leyland: ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చిందని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఇటీవల నేను డిల్లీలో ఒక ప్రముఖ ఛానల్ ఫైర్‌సైడ్ చాట్ కోసం వెళ్ళాను. అక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ నన్ను తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయని ఏపీకి ఏం ఉందని అడిగారని, ఏపీలో సిబిఎన్ ఉన్నారని తాను గర్వంగా చెప్పానన్నారు.

చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో ముందుకు సాగుతున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంటును మంత్రి లోకేష్ చేతులమీదుగా ప్రారంభించారు. అశోక్ లేలాండ్ తయారు చేసిన డబుల్ డెక్కర్ బస్సులో ప్లాంటు వద్దకు విచ్చేసారు. ప్లాం...