Hyderabad, ఏప్రిల్ 10 -- Asha Pasham Song Lyrics: కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా బోరు కొట్టదు. పైగా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తూనే ఉంటుంది. అలాంటిదే ఈ పాట కూడా. కేరాప్ కంచరపాలెం అనే ఓ చిన్న సినిమా నుంచి వచ్చిన ఆశ పాశం (asha pasham) సాంగ్ కూడా అలాంటిదే. ఆరున్నరేళ్ల కిందట యూట్యూబ్ లోకి అడుగుపెట్టిన ఈ సాంగ్ ఇప్పటికే 11 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.

వెంకటేశ్ మహా డైరెక్షన్ లో 2018లో వచ్చిన మూవీ కేరాఫ్ కంచరపాలెం. ఓ చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించింది. డిఫరెంట్ స్టోరీలైన్ తోపాటు ఇందులోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆశ పాశం సాంగ్ అయితే ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.

ఈ పాటను స్వీకార్ అగస్తి కంపోజ్ చేయగా.. అనురాగ్ కులకర్ణి పాడాడు. ఇక విశ్వ లిరిక్స్ అందించాడు. ఒక్క పాటతో జీవితసార...