Hyderabad, మార్చి 14 -- ఆర్థరైటిస్ ఒకసారి వస్తే జీవితాంతం వెంటాడుతుంది. ఆర్థరైటిస్ వల్ల కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. నిరంతర అసౌకర్యంగా ఉంటుంది. దీని వల్ల సాధారణ పనులు కూడా చేసుకోలేరు. ఆర్ధరైటిస్ వల్ల కలిగే నొప్పి ఇన్ఫ్లమేషన్ తగ్గించే శక్తి కొన్ని మూలికలకు ఉంది. ఇవన్నీ కూడా ఇంట్లోనే లభిస్తాయి. వాటితో కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కీళ్ల నొప్పులను తగ్గించవచ్చు.

దీన్ని గోల్డెన్ స్పైస్ అని పిలుస్తారు. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బలమైన శోథ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను, వాపులను తగ్గించేందుకు సహాయపడుతుంది. కాబట్టి పసుపును ఆహారంలో భాగం చేసుకోండి. పసుపు దీని తాగడం ద్వారా ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించుకోవచ్చు.

అల్లం అనేది ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక శక్తివంతమైన మూలిక. ...