భారతదేశం, మార్చి 1 -- మంచి నీళ్లు తాగినంత సులభంగా ప్రపంచ రికార్డులు క్రియేట్ చేయడం అలవాటుగా మార్చుకున్న ఆర్మండ్ డుప్లాంటిస్ మరోసారి అదరగొట్టాడు. ఈ స్వీడన్ అథ్లెట్ తనకు అలవాటైన స్టైల్లో 11వ సారి ప్రపంచ రికార్డు బద్దలుకొట్టాడు. ఏ క్రీడలోనైనా ఒక్కసారి ప్రపంచ రికార్డు నెలకొల్పితేనే వారెవా అంటారు. అలాంటిది ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 11 సార్లు ప్రపంచ రికార్డు సాధించిన డుప్లాంటిస్ ను సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఫ్రాన్స్ లో జరిగిన ఆల్ స్టార్ పెర్షె మీట్ లో డుప్లాంటిస్ తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే 6.27 మీటర్ల ఎత్తు దూకి గత ఆగస్టులో నెలకొల్పిన రికార్డు (6.26 మీటర్లు)ను తిరగరాశాడు. దీంతో స్టేడియం హోరెత్తింది. ఈ పోటీలకు ముందే రిలీజ్ చేసిన తన ఫస్ట్ సాంగ్ 'బాప్' స్టేడియంలో ప్లే అవుతుండగా.....