Hyderabad, ఫిబ్రవరి 6 -- కొందరిలో భుజం నొప్పి తరచూ వస్తూ ఉంటుంది. ఆ నొప్పి వచ్చిపోతూ ఉంటే పెద్దగా పట్టించుకోరు. ఆ నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఇలా తరుచూ జరుగుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీ కుడి భుజంలో నొప్పి వస్తూ ఉంటే అది పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్‌లో రాళ్ల సమస్యను సూచిస్తుంది.

పిత్తాశయంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్, బిలిరుబిన్, కాల్షియం లవణాల నిక్షేపాలు పేరుకుపోయి చిన్న చిన్న రాళ్లలా మారుతాయి. వాటి వల్ల పొత్తికడుపు నొప్పి, వికారం, జ్వరం, కామెర్లు, మలం, మూత్రం ముదురు రంగులోకి మారడం జరుగుతాయి. కొన్నిసార్లు కుడి భుజం నొప్పి పిత్తాశయ రాళ్లను కూడా సూచిస్తుంది.

న్యూఢిల్లీలోని మణిపాల్ హాస్పిటల్ ద్వారకాలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్, బేరియాట్రిక్, జిఐ & రోబోటిక్ సర్జరీ చైర్మన్...