భారతదేశం, ఏప్రిల్ 12 -- నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నచిస్తున్న 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాపై మొదటి నుంచి క్యూరియాసిటీ ఉంది. ఈ యాక్షన్ డ్రామా సినిమాపై టీజర్ తర్వాత బాగా బజ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంత్ కూడా ఓ ప్రధాన పాత్ర చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ట్రైలర్ నేడు (ఏప్రిల్ 12) వచ్చేసింది.

సిటీలోని క్రిమినల్స్ టాప్-10 లిస్ట్ తయారు చేయాలని పోలీస్ ఆఫీసర్ శ్రీకాంత్.. అడగడంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ షురూ అయింది. వన్ టూ టెన్ ఒకడే అని.. అర్జున్ అని శ్రీకాంత్‍కు ఓ పోలీస్ చెబుతాడు. అప్పుడే అర్జున్ (కల్యాణ్ రామ్) రౌడీలను చితకబాదేస్తుంటాడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కుమ్ముస్తుంటాడు. ఈ క్రమంలో ఐపీఎస్ ఆఫీసర్ అయిన వైజయంతి (విజయశాంతి).. కొడుకు అర్జున్‍ను...