భారతదేశం, ఏప్రిల్ 8 -- నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్ తర్వాత ఈ చిత్రంపై హైప్ బాగానే వచ్చింది. ఈ మూవీలో కల్యాణ్ రామ్ తల్లి పాత్రలో సీనియర్ నటి విజయశాంతి నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా సెన్సార్ జరిగింది. దీంతో ఈ చిత్రం గురించి సెన్సార్ టాక్ బయటికి వచ్చింది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సెన్సార్ టాక్ వెల్లడైంది. ఈ చిత్రంలో తల్లీకొడుకుల సెంటిమెంట్ బాగా పండిందని తెలుస్తోంది. కల్యాణ్ రామ్, విజయశాంతి మధ్య ఎమోషనల్ సీన్లు ఈ చిత్రానికి బలంగా ఉంటాయట. క్లైమాక్స్ సర్‌ప్రైజింగ్‍గా ఉంటుందని, ఇదే హైలైట్ అవుతుందనే టాక్ చక్కర్లు కొడుతోంది. హీరో కల్యాణ్ రామ్ కూడా ఈ చిత్రం క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని ఇటీవల...