Hyderabad, మార్చి 18 -- Arjun S/o Vyjayanthi Teaser: నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సోమవారం (మార్చి 17) ఉదయం లాంచ్ అయిన ఈ సినిమా టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఒక రోజులోనే ఏకంగా 12.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడంతోపాటు ట్రెండ్స్ లో టాప్ లో ఉండటం విశేషం.

యూట్యూబ్ లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ టీజర్ ను అప్‌లోడ్ చేసినప్పటి నుంచీ ట్రెండింగ్ లో నంబర్ వన్ కు దూసుకెళ్లింది. అసలు నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్లో ఇప్పటి వరకూ ఏ సినిమా టీజర్ కు రానంత రెస్పాన్స్ వస్తోంది.

విజయశాంతి, కల్యాణ్ రామ్ ఈ సినిమాలో తల్లీకొడుకులుగా నటిస్తున్నారు. విజయశాంతి ఓ ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

పోలీస్ ఆఫీసర్ వైజయంత...