భారతదేశం, మార్చి 17 -- నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం వస్తోంది. ఈ యాక్షన్ మూవీలో సీనియర్ నటి విజయశాంతి.. హీరోకు తల్లిపాత్ర పోషించారు. విజయశాంతి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం నుంచి నేడు (మార్చి 17) టీజర్ వచ్చేసింది.

పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా విజయశాంతి పవర్‌ఫుల్ గన్ షూటింగ్ సీన్‍తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ షురూ అయింది. "పది సంవత్సరాల కెరీర్లో ఎన్నో ఆపరేషన్స్. కానీ చావుకు ఎదురెళుతున్న ప్రతీసారి. నా కళ్ల ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్" అని వైజయంతి చెప్పే సెంటిమెంట్ డైలాగ్ ఉంది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ ఎంట్రీ ఉంది. అర్జున్ (కల్యాణ్ రామ్) కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని వైజయంతీ ఆశిస్తుంది. పోలీస్ అవకముందే నేరస్తుల అంతు చూస్తుంటాడు అర్జున్. ఓ పవర్ ఫుల...