Hyderabad, మార్చి 29 -- Arjun S/O Vyjayanthi First Song Naayaldhi Release Date: హిట్స్, ఫ్లాప్స్ అంటూ తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. బింబిసార మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ అమిగోస్, డెవిల్ సినిమాలతో ప్లాప్స్ అందుకున్నాడు.

ఇప్పుడు నందమూరి కల్యాణ్ రామ్ నటించిన సరికొత్త ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. నందమూరి కల్యాణ్ రామ్ అభిమానుల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఉంది. ఈ సినిమా సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.

ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రల మధ్య డైనమిక్స్ కీలకంగా ఉండనున్నాయి. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్...