భారతదేశం, ఏప్రిల్ 15 -- యూనిక్ స్టైల్ ఆఫ్ టేకింగ్ తో ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలను మెస్మరైజ్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకూ ఈ సెన్సేషనల్ డైరెక్టర్ మేకింగ్ పై వైరల్ కామెంట్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ కూడా సందీప్ రెడ్డి వంగాపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. అర్జున్ రెడ్డి చూస్తుంటే పిచ్చెక్కిందని పేర్కొన్నాడు.

అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాల్లో హీరోల యాక్షన్స్ తో తాను ఏకీభవించలేదని అర్జున్ కపూర్ అన్నాడు. అయినా ఆ క్యారెక్టర్స్ ఎలా థింక్ చేస్తున్నాయో అనేది సందీప్ అర్థమయ్యేలా చెప్పిన తీరును తాను ఎంజాయ్ చేస్తున్నట్లు అతను పేర్కొన్నాడు. ఆ డైరెక్టర్ విజువల్ స్టైల్ కు తాను ఫ్యాన్ అని అర్జున్ చెప్పాడు.

ఎడిటింగ్, ఫ్రేమింగ్, విజువల్, ఆడియో ప్యాటన్ తో సందీప్ రెడ్డి యూనిక్ గ...