Hyderabad, ఏప్రిల్ 6 -- Anasuya Ari Movie Release Problems: సినిమా పరిశ్రమ అనేది ఒక వింతైన ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని సినిమాలు ఇలా షూటింగ్‌ని ప్రారంభించి.. అలా థియేటర్స్‌లోకి వచ్చేస్తాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం ఏళ్ల తరబడి ల్యాబ్‌కే పరిమితం అవుతుంటాయి.

అయితే వీటిల్లో కొన్ని చిత్రాలు సరైన కంటెంట్‌ లేక ఆగిపోతే.. మరికొన్ని మాత్రం డిఫరెంట్‌ కంటెంట్‌, ఎవరూ టచ్‌ చేయలేని, ట్రెండింగ్‌ పాయింట్‌ ఉన్నప్పటికీ విడుదలకు నోచుకోవు. ఈ కోవలోకి చెందిన చిత్రమే 'అరి'. 'పేపర్‌ బాయ్‌'తో సూపర్‌ హిట్‌ అందుకున్న జయశంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయి దాదాపు రెండేళ్లు కావోస్తోంది.

అయితే, అరి సినిమా కంటే ముందు గీతా ఆర్ట్స్‌లో జయశంకర్‌ ఓ సినిమా చేయాల్సింది. స్క్రిప్ట్‌తో పాటు ప్రీప్రొడక్షన్‌ పనులు కూడా షూరు అయ్యాయి. కానీ, లాక్‌...