భారతదేశం, జనవరి 13 -- "Are You Dead? (నువ్వు చచ్చిపోయావా?)".. ఈ మాటలు వినగానే ఎవరైనా భయపడిపోతారు, ఆశ్చర్యపోతారు. మరికొందరు అసహ్యించుకుంటారు కూడా. కానీ ఇదొక "యాప్​" అంటే మీరు నమ్మగలరా? ఇంత భయంకరమైన పేరున్న యాప్‌ను ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకుంటారా? అని అనిపిస్తోందా. కానీ, చైనాలో ఇప్పుడు ఈ యాప్​ ఒక సంచలనం! ఆ దేశంలో ఇప్పుడు ఇదే అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న నంబర్ వన్ పెయిడ్ యాప్. అసలేంటి ఈ ఆర్​ యూ డెడ్​ యాప్​?

ఒంటరిగా నివసించే వారిలో ఉండే ఒక అంతులేని భయాన్ని ఈ యాప్ అడ్రస్ చేస్తోంది.

మే నెలలో ప్రారంభమైన ఈ యాప్, అనతి కాలంలోనే విపరీతమైన ఆదరణ పొందింది. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా, నగరాల్లో ఒంటరిగా బతికే యువతకు, వృద్ధులకు ఇది ఒక రక్షణ కవచంలా మారింది. ఒకవేళ తమకు అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా లేదా ప్రమాదం జరిగినా.. ఎవరూ గమనించకపోతే ఏంట...