Hyderabad, ఫిబ్రవరి 26 -- శరీరానికి వీలైనంత వరకూ విల్లులా వంచడాన్నే అర్ధ చక్రాసనం అంటారు. ఈ ఆసనాన్ని ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా వేసుకోవచ్చు. ఎక్కువ సేపు కూర్చొని వెనుక భాగంలో ఒత్తిడిగా, ఇబ్బందికరంగా అనిపిస్తే ఈ ఆసనంతో రిలీఫ్ పొందొచ్చు. మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెంచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది కూడా. ఫిజికల్‌గానే కాకుండా మెంటల్‌గా కూడా ఎన్నో బెనిఫిట్స్ అందించే ఈ అర్ధ చక్రాసనం గురించి మరింత తెలుసుకుందామా!

సంస్కృత పదం నుంచి వచ్చిందే ఈ అర్ధ చక్రాసనం. ఎన్నో ఆసనాలకు ఇదది ఒక బేసిక్ ఆసనం అని చెప్పుకోవచ్చు. బలం, సామర్థ్యంతో పాటు శరీరాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. హత, విన్యాస, అష్టాంగ యోగ విధానాలకు ఈ అర్ధ చక్రాసనం ఒక కోర్ లాంటిది. వెన్నెముక ఫ్లెక్సిబుల్ గా ఉండటంతో పాటు, పూర్తి శరీరంపై ఆధీనం తెచ్చుకునేందుకు ఈ ఆసనం...