భారతదేశం, అక్టోబర్ 5 -- భారత సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో రూపొందించిన స్వదేశీ ఇన్‌స్టంట్ మెసేజింగ్, కాలింగ్ యాప్ 'అరట్టై'. వాట్సాప్​కి ప్రత్యామ్నాయంగా పేరొందిన ఈ అరట్టై భారత్‌లో వేగంగా జనాదరణ పొందుతోంది. ఇది ప్రస్తుతం యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ రెండింటిలోనూ బాగా ప్రాచుర్యం పొందుతోంది. చెన్నై కేంద్రంగా అభివృద్ధి చేసిన ఈ కమ్యూనికేషన్ వేదిక, వినియోగదారులు కేవలం మొబైల్ నంబర్‌ను ఉపయోగించి సందేశాలు, వాయిస్ నోట్స్ పంపుకోవడానికి, మీటింగ్‌లలో పాల్గొనడానికి, కథనాలు, ఫోటోలు, డాక్యుమెంట్‌లను పంచుకోవడానికి అనుమతిస్తుంది. క్లీన్​ ఇంటర్‌ఫేస్, ఫీచర్ల శ్రేణి, గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు దీన్ని వాట్సాప్ వంటి ప్రముఖ మెసేజింగ్ సేవలకు బలమైన పోటీగా మారుస్తున్నాయి.

అరట్టై అంటే తమిళంలో "కాజ్యువల్​ చాట్​ (సాధారణ సంభాషణ)" అని అర్థం.

ప్ర: వాట్సాప్, ఇలాం...