Hyderabad, జనవరి 28 -- అరటిపువ్వుతో చేసే కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. శాకాహారులకు ఈ కూర నచ్చుతుంది. అరటిపువ్వు కూరను ఎంతో ప్రత్యేకంగా వండుతారు. ముఖ్యంగా వేడుకల సమయంలో శాకాహారులు దీన్ని స్పెషల్ డిష్ గా చెబుతారు. అరటిపువ్వు కూరను సింపుల్ వండేయచ్చు. రెసిపీ ఇదిగో.

అరటిపువ్వు తరుగు - ఒకటిన్నర కప్పు

నూనె - రెండు స్పూన్లు

పసుపు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చి శెనగపప్పు - ఒక స్పూను

ఆవాలు - అర స్పూను

మినపప్పు - ఒక స్పూను

ఎండుమిర్చి - నాలుగు

కరివేపాకులు - గుప్పెడు

పచ్చిమిర్చి - రెండు

జీలకర్ర - ఒక స్పూను

వేరుశెనగపలుకులు - మూడు స్పూన్లు

1. అరటి పువ్వును సన్నగా తరిగి ఒక గిన్నెలో వేయాలి. వాటిలో నీరు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఒక గిన్నెలో నీళ్లు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో అరటిపువ్వు తరుగును వేసి కలుపుకోవాలి....