భారతదేశం, మార్చి 4 -- అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది. ఇది ఆదివాసీ రైతులకు ఎంతో మేలు చేయనుంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా అరకు కాఫీని యూరప్‌కు ఎగుమతి చేసే అవకాశం వచ్చింది. దీని ద్వారా దాదాపు 2600 మంది రైతులకు లబ్ధి జరగనుంది. అసలు అరకు కాఫీకి ఎందుకంత డిమాండ్.. ఆర్గానికి సర్టిఫికేషన్ అంటే ఏంటీ.. దాని వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరకు కాఫీని గిరిజన రైతులు సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండిస్తారు. రసాయన మందులు వాడకుండా సహజ పద్ధతుల్లో పండించడం వల్ల ఇది మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో సిల్వర్ ఓక్, మిరియాల చెట్ల మధ్య ఈ కాఫీ తోటలు పెరుగుతాయి. ఈ ప్రత్యేకమైన వాతావరణం వల్ల కాఫీ గింజలకు ఒక ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తాయి. అరకులో అరబికా రకం కాఫీని పండిస్తారు. ఈ రకం కాఫీకి అంతర్జ...