భారతదేశం, మార్చి 16 -- ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ భార్య సైరా బాను ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తనను ఏఆర్ రహమాన్ మాజీ భార్య అని పిలవొద్దని ఆమె కోరారు. తాము ఇంకా ఆఫీషియల్ గా విడాకులు తీసుకోలేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఏఆర్ రహమాన్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఆదివారం (మార్చి 16) డీహైడ్రేషన్ కు గురికావడంతో ఏఆర్ రహమాన్ ను చెన్నై ఆసుపత్రికి తరలించారు. రొటీన్ చెకప్ తర్వాత మ్యూజిక్ కంపోజర్ డిశ్చార్జ్ అయ్యాడని హాస్పిటల్ అప్డేట్ ఇచ్చింది.

తమ ఉమ్మడి న్యాయవాది వందనా షా ద్వారా సైరా బాను ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ''ఆయన (ఏఆర్ రహమాన్) త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఛాతీలో నొప్పిగా ఉందని, యాంజియోప్లాస్టీ చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. దేవుడి దయ వల్ల ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. మేము అధికారికంగా విడాకులు తీసుకోల...