భారతదేశం, మార్చి 16 -- స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంగా అనిపించటంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో నేటి (మార్చి 16) ఉదయం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స నిర్వహించింది. ప్రస్తుతం రహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన టీమ్ వెల్లడించింది.

డీహైడ్రేషన్, మెడ నొప్పి కారణంగా ఏఆర్ రహమన్ ఇబ్బంది పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చేరినట్టు ఆయన టీమ్ చెప్పింది. నేడే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారని తెలుస్తోంది. లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే రహమాన్ ఇబ్బందిగా ఫీలయ్యారని తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉంటున్న ఆయనకు డీహైడ్రేషన్ అయిందని తెలుస్తోంది.

ఛాతినొప్పి కారణంగా ఏఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారని, వైద్యులు ఏంజియోగ్రామ్ నిర్వహించారని ముందుగా రూమర్లు బయటికి వచ్చాయి. అయిత...