భారతదేశం, ఫిబ్రవరి 6 -- APSWREIS Admissions: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు, ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్మీడియట్‌ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలను ఏపీ బీఆర్‌ఏజీ సెట్ 2025 ద్వారా చేపడతారు.

రాష్ట్రంలోని వివిధ క్యాంపస్‌లలో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-2026 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో బోధన ఉంటుంది. పూర్తి సమాచారం కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్‌సైట్‌ https://apbragcet.apcfss.in/ లో చూడవచ్చు.

విద్యార్దులు తమ సొంత జిల్లాల్లోని గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల కోస...