ఆంధ్రప్రదేశ్, జనవరి 29 -- ప్రయాణికుల రద్దీ, డిమాండ్ బట్టి ఏపీఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తీసుకువస్తోంది. అంతేకాకుండా యాత్రీకులు అత్య‌ధికంగా వెళ్లే మార్గాల‌కు అతి త‌క్కువ ధ‌ర‌కే ప్యాకేజీలను కూడా ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌హా కుంభ‌మేళాకు ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది.

కాకినాడ జిల్లాలోని కాకినాడ డిపో, అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాలోని అమ‌లాపురం, రాజోలు నుంచి కుంభ‌మేళాకు ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేశారు. కాకినాడ నుంచి వెళ్లే భ‌క్తుల‌కు ఆరు రోజులు, అమ‌లాపురం, రాజోలు నుంచి వెళ్లే భక్తుల‌కు ఎనిమిది రోజుల పాటు యాత్ర ఉంటుంది. మ‌హా కుంభ‌మేళా జ‌రిగే ప్ర‌యాగ‌రాజ్‌తో అయోధ్య‌, కాశీ పుణ్య‌క్షేత్రాల ద‌ర్శ‌నం కూడా ఉంటుంద‌ని డిపో మేనేజ‌ర్లు వేర్వురుగా ప్రకటించారు.

Published by HT Di...