భారతదేశం, ఏప్రిల్ 5 -- శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఈ నెల 6న జరిగే సీతారాముల కల్యాణోత్సవం జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతోంది. రాజమండ్రి డిపో నుంచి భద్రాచలానికి 8 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బస్సులు శనివారం ఇక్కడి బస్టాండ్‌ నుంచి బయలుదేరుతాయి.

మధ్యాహ్నం 12.15 గంటలకు ఒకటి, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్సు చొప్పున వెళతాయని రాజమండ్రి ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఎస్‌.కె.షబ్నం వివరించారు. ఆదివారం సీతారాముల కల్యాణోత్సవం ముగిసిన తర్వాత.. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకుంటాయని చెప్పారు.

ప్రస్తుతం రాజమండ్రి నుంచి భద్రాచలానికి రోజూ 10 ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌ సర్వీసులు నడుస్తున్నాయి. కుక్కునూరు మీదుగా తొమ్మిది, మారేడుమిల్లి మీదు...