భారతదేశం, మార్చి 10 -- ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టి, ప్ర‌యాణికులు, యాత్రీకులు అత్య‌ధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షిత‌మైన ప్ర‌యాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే త‌మిళ‌నాడులోని అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై), రామేశ్వ‌రం, మ‌ధురై మీనాక్ష్మ‌తో పాటు కేర‌ళ‌లోని అనంత‌ప‌ద్మ‌నాభ‌ స్వామి ఆల‌యం (తిరువ‌నంత‌పురం)కు బస్సు స‌ర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది.

అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై), రామేశ్వ‌రం యాత్ర పేరుతో యాత్రికుల కోసం ప్ర‌త్యేక స‌ర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొమ్మిది రోజుల పాటు 13 క్షేత్రాల‌ను ద‌ర్శించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. ఈనెల 19న సాయంత్రం 6 గంట‌ల‌కు బ‌స్సు రాజ‌మండ్రి డిపో నుంచి బ‌య‌లుదేరుతుంది. ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు స‌ర్వీస్ ...