తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, డిసెంబర్ 28 -- మరికొద్దిరోజుల్లోనే సంక్రాంతి సందడి మొదలుకాబోతుంది. దీంతో చాలా మంది తమ సొంత ఊర్లలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. ఇందుకోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లలో ఉంటారు. అయితే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది.

సంక్రాంతి పండగ వేళ ఉండే రద్దీ దృష్ట్యా. హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ లోని వేర్వురు ప్రాంతాలకు వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది.

ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది. జనవరి 13వ తేదీ వరుక సేవలు అందిస్తాయని తెలిపింది. రెగ్యులర్‌గా నడిచే సర్వీసులతో పాటు 2400 బస్సులను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చ...