ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 15 -- మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ప్రకటించింది. రాష్ట్రంలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది. మొత్తం 3,500 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

మొత్తం 3500 ప్రత్యేక బస్సులను ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని 12 శైవక్షేత్రాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా తిరుపతిలోని తొమ్మిది శైవక్షేత్రాలకు, నెల్లురూ జిల్లాలోని 9 ఆలయాలకు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. సత్యసాయి, నంద్యాల, గుంటూరుతో పాటు మిగతా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలకు బస్సులు ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

మహాశివరాత్రి వేళ రాష్ట్రంలోని శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. రాష్ట్రంలోని అన్ని డిపోలతో పాటు తెలంగాణ నుంచి కూడా...