భారతదేశం, ఫిబ్రవరి 17 -- APSRTC Maha Kumbha Mela :మహా కుంభమేళాకు వెళ్లే భ‌క్తుల‌కు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అమ‌లాపురం నుంచి ఉత్తర‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జ‌రిగే మ‌హా కుంభ‌మేళాకి ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ స‌ర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది. ఇత‌ర ఆధ్యాత్మిక ప్రాంతాల ప‌ర్యట‌న స‌ర్వీసులానే ఈ బ‌స్సు స‌ర్వీస్‌లు కూడా మ‌హా కుంభ‌మేళాను సంద‌ర్శించేందుకు తీసుకెళ్తుంది.

ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్రత్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టి, ప్రయాణికులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షిత‌మైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే ఉత్తర‌ప్రదేశ్‌లోని మ‌హా...