భారతదేశం, జనవరి 28 -- APSRTC Kumbh Mela: కుంభమేళాకు వెళ్లే వారికి ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ నుంచి ప్రత్యేక స‌ర్వీస్‌ ప్రకటించింది. యాత్రికులు ఈ బస్సు సర్వీస్‌ వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది. ఇత‌ర ఆధ్యాత్మిక ప్రాంతాల ప‌ర్య‌ట‌న స‌ర్వీసులానే ఈ బ‌స్సు స‌ర్వీస్‌లు కూడా మ‌హా కుంభ‌మేళాను సంద‌ర్శించేందుకు తీసుకెళ్తుంది.

ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టీ, ప్ర‌యాణీకులు, యాత్రీకులు అత్య‌ధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షిత‌మైన ప్ర‌యాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌హా కుంభ‌మేళాకి ఈ బస్సు స‌ర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.

మొత్తం ఎనిమిది రోజుల పాటు యాత్ర కొన‌సాగుతోంది. 3,600 కిలో మీట‌ర్ల మేరా యాత్ర ఉంటుంద‌ని జిల్లా ప్ర‌జా ర‌వాణా అ...