భారతదేశం, ఫిబ్రవరి 16 -- APSRTC Special Buses : మ‌హాశివ‌రాత్రి నేప‌థ్యంలో శ్రీ‌శైలం మ‌ల్లన్న ద‌ర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల‌తో పాటు తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర నుంచి కూడా భ‌క్తులు ల‌క్షలాది మంది త‌ర‌లివ‌స్తారు. ప్రయాణికులు, భ‌క్తుల సౌక‌ర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల ర‌ద్దీ దృష్ట్యా ఫిబ్రవ‌రి 19 నుంచి ఫిబ్రవ‌రి 28 వ‌ర‌కు బ‌స్సు స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా రోజుల్లో శివ దీక్షాప‌రుల‌కు 19 నుంచి 23 వ‌ర‌కు స్పర్శ ద‌ర్శనం క‌ల్పిస్తారు. అలాగే ఫిబ్రవ‌రి 19 నుంచి మార్చి 1 వ‌ర‌కు శ్రీశైలం మ‌హా శివ‌రాత్రి బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో భ‌క్తులు ర‌ద్దీని త‌గ్గించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తుంది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తకుం...