భారతదేశం, ఫిబ్రవరి 4 -- శ్రీ‌కాకుళం నుంచి ప్ర‌యాగరాజ్‌లో జ‌రిగే మ‌హా కుంభ‌మేళాకు, తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి శివ‌రాత్రికి కాశీ యాత్ర‌కు.. ఏపీఎస్ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జరీ స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స‌ర్వీస్‌లను యాత్రికులు వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.

శ్రీకాకుళం నుంచి ఫిబ్ర‌వ‌రి 8న రాత్రి 8 గంట‌ల‌కు సూప‌ర్ ల‌గ్జ‌రీ బస్సు బ‌య‌లుదేరుతుంది. పూరి (జ‌గ‌న్నాథ‌స్వామి దేవాల‌యం), కోణార్క్ (సూర్య దేవాల‌యం), భువ‌నేశ్వ‌ర్ (లింగ‌రాజ్ ఆల‌యం) ప్ర‌యాగ‌రాజ్ (కుంభ‌మేళా, పుణ్య‌స్నానం) అనంత‌రం.. తిరిగి ప్ర‌యాణం అవుతుంది. తిరుగు ప్ర‌యాణంలో వార‌ణాసి, గ‌య‌, బుద్ధ‌గ‌య సంద‌ర్శ‌న‌ ఉంటుంది.

ఆరు రోజులు పాటు ఈ యాత్ర కొన‌సాగుతుంది. ప్ర‌యాగరాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు బ‌స ఉంటుంది. టిక్కెట్టు ధ‌ర ఒక్కరికి రూ.9,500గా ఆర్టీ...