భారతదేశం, జనవరి 30 -- కుంభ‌మేళాకు వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది. విశాఖ, కడప నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాల‌ని యాత్రికుల‌ను విశాఖ‌ప‌ట్నం జిల్లా ప్ర‌జార‌వాణా అధికారి బి. అప్ప‌ల‌నాయుడు, క‌డ‌ప డీపో మేనేజ‌ర్ డిల్లీశ్వ‌ర‌రావు కోరారు.

1. మ‌హా కుంభ‌మేళాకు విశాఖ‌ప‌ట్నం నుంచి మూడు రోజుల పాటు సూప‌ర్ ల‌గ్జ‌రీ (2+2 పుష్ బ్యాక్‌) స్పెష‌ల్ స‌ర్వీసులు అందుబాటులోకి తెచ్చారు.

2. ఫిబ్ర‌వ‌రి 4, 8, 12 తేదీల్లో విశాఖ‌ప‌ట్నం డిపో నుంచి బ‌స్సులు బ‌య‌లు దేరుతాయి.

3. మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర కొన‌సాగుతుంది.

4. ప్ర‌యాగ‌రాజ్‌తో పాటు అయోధ్య‌, వార‌ణాసి వంటి పుణ్య‌క్షేత్రాల ద‌ర్శ‌నం కూడా ఉంటుంది.

5. ప్ర‌యాగ‌రాజ్‌, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు రాత్రి బ‌స ఉంటుంది.

6. టిక్కెట్టు ధ‌ర ఒక్కొ...