భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రయాణికుల, భక్తుల కోరిక మేరకు గుంటూరు నుంచి మహా కుంభమేళా (ప్రయాగరాజ్)కు ఫిబ్రవరి 11న స్పెషల్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 15న మరో స్పెషల్ హైటెక్ (2+2) పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సు స‌ర్వీసులు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటలకు గుంటూరులో బయలుదేరుతాయి. ఈ యాత్ర మొత్తం 8 రోజులు పాటు సాగుతుంది.

మొదటి రోజు బస్సు గుంటూరు లో 10 గంటలకు బయలుదేరి.. రెండో రోజు సాయంత్రానికి ప్రయాగరాజ్ చేరుకుంటుంది. మూడో రోజు ప్రయాగరాజ్‌లో బస చేసి, పుణ్య స్నానాలు ఆచరించి, నాలుగో రోజు రాత్రికి అయోధ్యరే బయలుదేరుతుంది. ఐదో రోజు ఉదయం అయోధ్య చేరుకొని, బాలరాముని దర్శించుకుని, అదే రోజు సాయంత్రం వారణాసికి బయలుదేరుతుంది. ఆరో రోజు ఉదయం వారణాసి చేరుకొని, ఆ రోజు వారణాసిలో బస చేసి ఏడో రోజు ఉదయం వార...