భారతదేశం, జనవరి 26 -- APSRTC Mahakumbha Mela Tour : ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానంతో పాటు ప్రముఖ ఆలయాల దర్శనానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తుంది. ఏపీలోని రాయదుర్గం, రాజమహేంద్రవరం డిపోల నుంచి 11 రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ లో 11 రోజుల్లో 13 క్షేత్రాలను దర్శించుకోవచ్చు.

రాయదుర్గం డిపో నుంచి ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు 11 రోజుల మహాకుంభమేళా యాత్ర ప్రారంభం అవుతుంది. విజయవాడ, అన్నవరం, భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్, కుంభమేళా, వారణాసి, అయోధ్య, గయ, బుద్ధగయ, భద్రాచలం, త్రివేణి సంగమ స్నానం...ఈ ప్కాకేజీలో కవర్ చేస్తారు. ప్రయాగరాజ్, కాశీలో ఒక రోజు బస చేయవచ్చు. రాయదుర్గం నుంచి మహాకుంభమేళా టూర్ ప్యాకేజీలో ఒక్కరికి టికెట్ ధర రూ.14 వేలుగా నిర్ణయించారు. ఈ టూర్ లో ఉదయం అల్ఫా...