భారతదేశం, జనవరి 28 -- Apsara Rani: అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో న‌టించిన రాచ‌రికం మూవీ ఈ నెల 31న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి సురేశ్ లంకలపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీలో వ‌రుణ్ సందేశ్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల జ‌రిగింది.

ఈ ఈవెంట్‌లో త‌న సినీ జ‌ర్నీతో పాటు రాచ‌రికం మూవీపై అప్ప‌రారాణి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

అప్సరా రాణి మాట్లాడుతూ.. ''ఒకే రకమైన పాత్రలు వ‌స్తుండ‌టంతో సినిమాల‌ను వ‌దిలేసి ఇండ‌స్ట్రీకి దూరంగా ఉండాల‌ని అనుకున్నా. ఆ టైంలోనే ఆ దేవుడు రాచ‌రికం టీమ్‌ను నా దగ్గరకు పంపించాడు. గ‌తంలో నేను చేసిన పాత్ర‌ల‌కు పూర్తి భిన్నంగా ఇందులో నా క్యారెక్ట‌ర్ ఉంటుంది. ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపిస్తాను. ఈ మ...