ఆంధ్రప్రదేశ్,అమరావతి, మార్చి 29 -- ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు ముగియటంతో అధికారులు గడువు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు. ఏప్రిల్ 6వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మస్తానయ్య ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఈ ఎంట్రెన్స్ ద్వారా గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకులాల్లోని ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తారు. వీరంతా కూడా ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రెన్స్ పరీక్ష ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

ఇక ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ డీసీ ప్రవేశాలకు సంబంధించి అధికారులు అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించారు. ఈ ఎంట్ర...