భారతదేశం, ఏప్రిల్ 9 -- మహావీర్ జయంతి కారణంగా 2025 ఏప్రిల్ 10న చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. రాష్ట్ర-నిర్దిష్ట పండుగలు, ప్రాంతీయ సెలవులను బట్టి బ్యాంకు సెలవులు మారుతూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం, మహావీర్ జయంతిని గురువారం 10 ఏప్రిల్ 2025న జరుపుకొంటారు. దీని కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు.

మహావీర్ జయంతి అనేది జైన సమాజం ప్రధాన పండుగ. ఏప్రిల్ 10న గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసేస్తారు. దీనితో పాటు, ఒడిశా, తమిళనాడు (కొన్ని ప్రాంతాలు తప్ప), చండీగఢ్, బీహార్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, గోవా, కేరళ మరియు సిక్కిం వంటి రాష్ట్రాలలో బ్యాంకులు పనిచేస్తాయి.

ఏప్రిల్ 10, 2025 గురువారం మహావీర్ జయంతి కారణంగా అనేక ...