Andhrapradesh,amaravati, ఏప్రిల్ 10 -- ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 10, 11, 15, 16, 17 తేదీల్లో ఆయా అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది. నిర్ణయించిన తేదీల్లో హాజరై. వారి ధ్రువపత్రాలను వెరిఫై చేసుకోవాలి. ఈ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థులు హాల్‌టికెట్ నెంబర్లను ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించింది.

సర్టిఫికెట్ పరిశీలన తర్వాత ఎంపికైన వారి తుది జాబితాను ప్రకటిస్తారు. అభ్యర్థులు తీసుకు రావాల్సిన చెక్‌ లిస్ట్‌ తో పాటు ఇతర వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచింది. వీటన్నింటిని కూడా ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల సమర్పణకు ఎక్కువ సమయం అవసరమైన అభ్యర్థులు appscgroup2services@gmail.com కు మెయిల్ చేయవచ్చు.

ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు ఇటీవల...