భారతదేశం, ఫిబ్రవరి 21 -- APPSC Group 2 Roster : రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళ‌న చెందుతున్నారు. విద్యార్థుల‌కు న‌ష్టంగా ఉన్న రోస్టర్ విధానాన్ని మార్చాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన 9 కీల‌క అంశాలివే.

1. రాష్ట్రంలో 899 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు గ‌త వైసీపీ ప్రభుత్వం 2023 డిసెంబ‌ర్ 7న నోటిఫికేష‌న్ ఇచ్చింది. అప్పుడే గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వహించారు. ఆ త‌రువాత ఎన్నిక‌లు రావ‌డంతో గ్రూప్‌-2 మెయిన్స్ ఆగిపోయింది. అయితే అనేక సార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన మెయిన్స్ ప‌రీక్ష ఎట్టకేల‌కు ఫిబ్రవ‌రి 23 (ఆదివారం) నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష రాయ‌నున్నారు. 13 ఉమ్మడి 13 జిల్లాల్లోని 175 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వహిస్తారు.

2. నోటిఫికేష‌న్‌లో ఇచ్చిన రోస్టర్ విధానంలోనే పొర‌పాట్లు ...