ఆంధ్రప్రదేశ్, మార్చి 20 -- ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ స్క్రీనింగ్‌ పరీక్షకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రాథమిక కీలను విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రాథమిక కీలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మార్చి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తెలియజేయవచ్చని ఏపీపీఎస్సీ పేర్కొంది. కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే వీటిని స్వీకరిస్తామని స్పష్టం చేసింది. ఈ ఎగ్జామ్ ను మార్చి 16న నిర్వహించిన సంగతి తెలిసిందే. అటవీశాఖలో 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి గత ఏడాది 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 16న పరీక్ష నిర్వహించారు.

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ (డీఈఓ) పోస్టులకు సంబంధించిన హాల్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. 2023 డిసెంబర్ 22న డీఈఓ పోస్టుల భర్తీకి...