ఆంధ్రప్రదేశ్,అమరావతి, మార్చి 26 -- ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్ (ఏపీపీఎస్సీ) అల‌ర్ట్ ఇచ్చింది. 2024లో ఇచ్చిన నోటిఫికేష‌న్ల‌కు సంబంధించిన రాత ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల చేసింది. మొత్తం ఎనిమిది నోటిఫికేష‌న్ల‌కు సంబంధించి ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.

రాత ప‌రీక్ష‌ల షెడ్యుల్ ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 30 వ‌రకు నాలుగు రోజుల పాటు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎనిమిది నోటిఫికేషన్‌ల పరీక్షలను విశాఖపట్నం, కృష్ణ, చిత్తూరు, అనంతపురం నాలుగు జిల్లాల్లోని కేంద్రాల్లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఏపీపీఎస్సీ కార్య‌ద‌ర్శి ఐ. న‌ర‌సింహమూర్తి తెలిపారు.

1. ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ స‌ర్వీస్ అసిస్టెంట్ డైరెక్ట్ పోస్టుల‌కు జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేప‌ర్-1) ఏప్రిల్ 28 తేదీన ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు జ‌రుగు...