భారతదేశం, మార్చి 22 -- APPSC Exam Dates : ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో పాలిటెక్నిక‌ల్, జూనియ‌ర్‌, డిగ్రీ కాలేజీల లెక్చర‌ర్ పోస్టుల‌కు ప‌రీక్షల తేదీల‌ను ప్రక‌టించింది. ప‌రీక్షల‌ను జూన్ 16వ తేదీ నుంచి నుంచి 26వ తేదీ వ‌ర‌కు నిర్వహించనుంది.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, జూనియ‌ర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, తిరుల‌మ తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) డిగ్రీ, జూనియ‌ర్ కాలేజీల్లో 464 లెక్చర‌ర్ పోస్టుల‌కు ప‌రీక్షల నిర్వహ‌ణ‌కు ఏపీపీఎస్సీ తేదీల‌ను ప్రక‌టించింది.

1. రాష్ట్రంలో ఏపీ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ స‌ర్వీస్ కింద‌ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ (ఇంజ‌నీరింగ్‌, నాన్ ఇంజ‌నీరింగ్‌)లో 99 లెక్చర‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు 2023 డిసెంబ‌ర్ 21వ తేదీన‌ నోటిఫికేష‌న్ ఇచ్చారు. 2024 జ‌న‌వ‌రి 29వ తేదీ నుంచి 20...