భారతదేశం, మార్చి 23 -- APPSC : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అల‌ర్ట్ ఇచ్చింది. ఉద్యోగుల‌కు కంప్యూట‌ర్ ప్రావీణ్య ప‌రీక్షకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఏప్రిల్ 12, 13 తేదీల్లో ప‌రీక్ష నిర్వహ‌ణ‌కు షెడ్యూల్ చేసింది. ఉద్యోగులకు ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ అంద‌రూ సిద్ధంగా ఉండాలని తెలిపింది.

ఈ మేర‌కు ఏపీపీఎస్సీ కార్యద‌ర్శి ఐ. నరసింహమూర్తి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలలోని కొంతమంది ఉద్యోగులు, పంచాయ‌తీరాజ్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగంలోని పంచాయ‌తీ కార్యద‌ర్శి గ్రేడ్‌-V, రెవెన్యూ శాఖ‌లో గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్‌-1, వీఆర్‌వో గ్రేడ్‌-1ల‌కు కంప్యూట‌ర్ ప్రావీణ్య ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఆయా విభాగాల ఉద్యోగులంద‌రూ కంప్యూట‌ర్ ప‌రిజ్ఞాన ప‌రీక్షకు సిద్ధంగా ఉండాల‌ని సూచించారు.

అలాగే 2014 మే 12 త‌ర...