భారతదేశం, మార్చి 5 -- టెక్ దిగ్గజం యాపిల్ రెండు కొత్త ఐప్యాడ్‌లను లాంచ్ చేసింది. ఎం3 చిప్‌తో కొత్త ఐప్యాడ్ ఎయిర్, A16 చిప్‌సెట్‌తో 11వ జనరేషన్ ఐప్యాడ్‌ను ప్రవేశపెట్టి తన ఐప్యాడ్ లైన్‌అప్‌ను రిఫ్రెష్ చేసింది. కొత్త iPad Air 11, 13 అంగుళాల వేరియంట్లలో లాంచ్ చేశారు. iPad 11లో 11 అంగుళాల డిస్‌ప్లే ఉంది. కొత్త ఐప్యాడ్ ధర రూ.32,900 నుండి ప్రారంభమవుతుంది. వీటితోపాటుగా ఒక కొత్త మ్యాజిక్ కీబోర్డ్ కూడా ప్రవేశపెట్టబడింది యాపిల్.

ఎం3 చిప్‌తో కూడిన కొత్త iPad Air, iPad 11, కొత్త మ్యాజిక్ కీబోర్డ్ భారతదేశంలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ పరికరాలను మార్చి 12 నుండి భారతదేశంలో కొనుగోలు చేయవచ్చు. కొత్త iPad Air బ్లూ, పర్పుల్, స్టార్‌లైట్, స్పేస్ గ్రే వేరియంట్లలో వచ్చింది. iPad 11 బ్లూ, పింక్, యెల్లో, సిల్వర్ రంగు వేరియంట్ల...