భారతదేశం, మార్చి 26 -- APPGECET 2024: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ PG Engineering కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ Common Entrance పరీక్ష నిర్వహణకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఎంట్రన్స్‌ టెస్ట్ నిర్వహించనున్నారు.

ఏపీ పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ ద్వారా ఎంటెక్‌ M tech, ఎం ఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్‌ పరీక్షకు ఓసీ అభ్యర్ధులు రూ.1200 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు రూ.900, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి.

పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్ Entrance test పూర్తి నోటిఫికేషన్‌ వెబ్‌సైట...