ఆంధ్రప్రదేశ్,అమరావతి, మార్చి 9 -- ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ(APOSS) పదో తరగతి హాల్ టికెట్లు వచ్చేశాయ్..! విద్యార్థులు ఏపీఓఎస్ఎస్ అమరావతి అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఏపీ ప్రభుత్వ వాట్సాప్ (మన మిత్ర) నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 17 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. విద్యార్థి పేరు, స్కూల్ పేరు, జిల్లా వివరాలు నమోదు చేసి హాల్ టికెట్ పొందవచ్చు.

ఇక ఈ హాల్‌ టికెట్లను వాట్సాప్‌ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. విద్యార్థులు వాట్సప్‌ నంబరు 9552300009 కి హాయ్‌ అనే సందేశాన్ని పంపాలి. ఆ తర్వాత సర్వీసును ఎంపిక చేసుకొని.. హాల్‌టికెట్‌ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఓపెన్ టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఆరో రోజులు పాటు జ‌రుగుతాయి. ప‌రీక్ష‌లు ప్ర‌తి రోజూ ఉద‌యం 9.30 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయి. పరీక్షలో ...